- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇబ్బందిగా అనిపిస్తే చేయను.. కానీ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో అలా చేశాం తృప్తిని ఇచ్చింది: చాందిని చౌదరి
దిశ, సినిమా: కేటుగాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ చాందిని చౌదరి. తర్వాత కలర్ ఫొటో సినిమాలో నటించి యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. మార్చి 8 న విడుదలైన హీరో విశ్వక్ సేన్ గామి చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై పలు విషయాలు పంచుకుంది. ‘సినీ ఇండస్ట్రీలో నటన తర్వాత దర్శకురాలిగా చేయాలన్నది నా కళ. ఫ్లాట్ ఫారమ్ ఏదైనా మంచి రోల్ ఉంటే తప్పకుండా చేస్తాను. నాకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం మనీ ఎంత ఇచ్చినా చేయను. టైమ్ ఎంతో విలువైనది. సినీ పరిశ్రమలో సమయం విలువ ఎంతో ఎక్కువ. ఓ స్టార్ నిర్మాత వల్ల నా రెండు సంవత్సరాల టైమ్ వేస్ట్ అయింది. లేకపోతే ఇప్పటిదాని కంటే ఇంకొంచెం బెటర్ పొజిషన్ లో ఉండేదాన్ని కావచ్చు’’ అంటూ హీరోయిన్ చాందిని చౌదరి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
చాందిని చౌదరి గామి సినిమా గురించి మాట్లాడుతూ.. గామి స్టోరీ విన్నప్పుడు ఈ మూవీని అస్సలు మిస్ చేసుకోకూడదని అనుకున్నాను. నేను ఎప్పుడైన కథ విన్నాక కొంచెం సమయం తీసుకుని.. వారికి ఎస్ (OR) నో చెప్తాను. కానీ గామి కథ విన్నాక ఏం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేశాను. నా మనసుకు ఎంతో తృప్తిని ఇచ్చిన చిత్రమిది. హిమలయాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ చేశాం. ఆ ప్రాంతంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. పలు సన్నివేశాలకు రోప్స్ సాయంతో వేలాడటం, కొండల మీది నుంచి దూకడం లాంటి సాహసాలు చేయాల్సి వచ్చింది. అంటూ చాందిని చౌదరి వెల్లడించింది.