గుడ్ న్యూస్.. సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్‌ ఫ్రీగా పొందే ఛాన్స్!

by Jakkula Samataha |   ( Updated:2024-04-19 14:58:32.0  )
గుడ్ న్యూస్.. సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్‌ ఫ్రీగా పొందే ఛాన్స్!
X

దిశ, సినిమా : కొంతమంది తమకు నచ్చిన నటీనటుల ఫోటోలు దాచుకుంటారు. అంతే కాకుండా ఇంకొంత మంది ఇది ఆ సినిమాలో ఆ హీరోయిన్ వేసుకున్న డ్రెస్, ఆ హీరో వేసుకున్న షర్ట్ అంటూ ఇలా మూవీలోని మోడల్ డ్రెసెస్ కొనుగోలు చేసి సంబరపడిపోతుంటారు. కానీ ఏకంగా సినిమాలో ప్రభాస్ వాడిన వస్తువు మీకు డైరెక్ట్‌గా ఇచ్చేస్తే ఎలా ఉంటుంది. వామ్మో.. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం అంటారు కదా.

అయితే ఇప్పుడు అలాంటి న్యూసే ప్రభాస్ ఫ్యాన్స్‌కు చెప్పబోతున్నాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు తీపి కబురు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సినిమా సలార్. ఈ మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఈ మూవీ ఓటీటీలో కూడా రిలీజై మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఇది అతి త్వరలో..ఏప్రిల్ 21న ప్రముఖ టీవీ ఛానల్‌ స్టార్ మాలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా వారు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. సలార్ మూవీ చూస్తూ.. స్టార్ మా అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్‌గా చెప్పిన వారికి సలార్ మూవీలో ప్రభాస్ వాడిన బైక్‌ను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఎవరు ఈ బైక్ సొంతం చేసుకుంటారో చూడాలి మరి.

Read More...

ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేయబోతున్న రామ్ చరణ్.. కెరీర్‌పై ప్రభావం పడనుందా?మెగా ఫ్యాన్స్ ఫైర్

Advertisement

Next Story