చైతూ పెద్ద సైకో అందుకే సమంత వదిలేసింది.. శోభిత లైఫ్‌ కూడా నాశనమే.. ఉమైర్‌ సంధూ సంచలన కామెంట్స్

by Kavitha |
చైతూ పెద్ద సైకో అందుకే సమంత వదిలేసింది.. శోభిత లైఫ్‌ కూడా నాశనమే.. ఉమైర్‌ సంధూ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ‘ఏమాయ చేశావే’ మూవీలో నటించిన స్టార్ హీరోయిన్ సమంతతో లవ్‌లో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లైనా నాలుగు సంవత్సరాలకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని వేరు వేరుగా ఉంటున్నారు. అయితే సామ్‌తో విడాకుల తర్వాత చైతన్య శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు పలు పుకార్లు షికార్లు కొట్టాయి. అలాగే వారిద్దరు కలిసి ఉన్నప్పటి ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ, వాటిపై వారిద్దరు ఏనాడు స్పందించలేదు. అలా అని కొట్టిపారేయనూలేదు.

అయితే ఆ పుకార్లను నిజం చేస్తూ ఆగస్టు 8న నాగచైతన్య శోభితలు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీనిని స్వయంగా నాగార్జున.. చైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ X ద్వారా కొత్త కోడలుకు స్వాగతం పలికారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి నిశ్చితార్ధం పై కొందరు సపోర్టీవ్ మాట్లాడుతూ కామెంట్స్ పెడుతుంటే మరికొందరు మాత్రం పలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ ఉమైర్ సంధు సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది. అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‌ శోబితా దూళి పాళ్ల ఎంగేజ్‌ మెంట్‌ కార్యక్రమంను వ్యతిరేకిస్తూ... ఈ పోస్ట్‌ పెట్టాడు ఉమైర్‌ సంధు. ఆ పోస్ట్‌లో భాగంగా.. ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌ సమంతను పెళ్లి చేసుకుని... ఆమె జీవితాన్ని నాశనం చేశాడని అక్కినేని నాగచైతన్యపై ఫైర్ అయ్యాడు.

ఇక ఇప్పుడు హీరోయిన్‌ శోభిత దూళిపాళ్లను ఎంగేజ్‌‌మెంట్‌ చేసుకుని...ఆమె లైఫ్‌ నాశనం చేసేలా ఉన్నాడని అక్కినేని నాగచైతన్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాగచైతన్య పెద్ద సైకో అని.. అందుకే అతన్ని సమంత వదిలేసిందంటూ బాంబ్‌ పేల్చారు ఉమైర్‌ సంధూ. ఇక ఉమైర్‌ సంధూ అక్కినేని నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.


Advertisement

Next Story

Most Viewed