తండ్రికి మద్దతుగా చైతూ.. ఆయన తప్పేమి లేదంటూ క్లారిటీ..!!

by sudharani |   ( Updated:2023-05-08 08:57:52.0  )
తండ్రికి మద్దతుగా చైతూ.. ఆయన తప్పేమి లేదంటూ క్లారిటీ..!!
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య హీరోగా వస్తున్న తాజా సినిమా ‘కస్డడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది మూవీ టీం. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన వ్యక్తిగత విషయాలు, సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అక్కినేని వారసులకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ ఒక్కటి కూడా దక్కలేదు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఇదంతా నాగార్జున చేసిన తప్పే. నాగార్జున తన కొడుకులను పట్టించుకోలేదు. అందుకే సరైన డైరెక్టర్ చేతిలో పెట్టలేదు కాబట్టే ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదని అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అఖిల్‌కు ఇండస్ట్రీ హిట్ ఒక్కటి కూడా కొట్టకపోవడానికి.. అఖిల్ సొంత నిర్ణయాలు కారణమా..? లేక నాగార్జున సరైన జడ్జిమెంట్ చేయలేకపోతున్నారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున తలచుకుంటే ఎలాంటి డైరెక్టర్‌నైనా తన వారసుల కోసం సెట్ చేయవచ్చు.

కానీ అఖిల్, చైతు విషయంలో అది జరగడం లేదని చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇదే ప్రశ్న నాగచైతన్యకి ఎదురవగా.. చైతూ దీనికి సమాదానమిస్తూ ‘‘నేను కానీ, అఖిల్ కానీ ఎవరైనా డైరెక్టర్‌తో వర్క్ చేయాలని ఉందని చెబితే నాన్న వెంటనే కారులో వెళ్లి అడ్వాన్స్ ఇచ్చి ప్రాజెక్టు సెట్ చేస్తారు. మీకు ఏ డైరెక్టర్‌తో వర్క్ చేయాలని ఉందో చెప్పండని నాన్న చాలా సార్లు అడిగారు. ఇందులో ఆయన తప్పు ఏమీ లేదు. కాకపోతే మాకంటూ సొంతంగా అవగాహన రావాలనే ఉద్దేశంతో మేమే ప్రాజెక్ట్స్ అంగీకరిస్తున్నాము’’ అంటూ చైతూ చెప్పుకొచ్చాడు. కాగా.. నాగ చైతన్య మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more:

Naga Chaitanya:'నా తొలి ముద్దు ఆమెతోనే.. అంటూ ఓపెన్ అయిన నాగ చైతన్య

నాగచైతన్యపై ప్రేమను బయట పెట్టిన కృతి శెట్టి.. అలా చెబుతూ..

‘రాత్రంతా అదే పని.. రోజంతా ఇలా’ సామ్ పోస్ట్ వైరల్

Advertisement

Next Story