చైతన్య - శోభిత ఎంగేజ్‌మెంట్.. ఈ ఇద్దరినీ దారుణంగా ట్రోల్ చేస్తున్న సమంత(వీడియో)

by Kavitha |
చైతన్య - శోభిత ఎంగేజ్‌మెంట్.. ఈ ఇద్దరినీ దారుణంగా ట్రోల్ చేస్తున్న సమంత(వీడియో)
X

దిశ, సినిమా: ‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రేమించుకొని పెద్దలనొప్పించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత అందరికీ సుపరిచితమే. కానీ, వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయింది. ఇక విడాకుల తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను నిజం చేస్తూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. అయితే వీరి ఎంగేజ్‌మెంట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా షేక్ అవుతున్న విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య ఓ ఇంటి వాడు కాబోతున్నాడంటూ చై- శోభితల ఎంగేజ్‌మెంట్ ఫొటోలను ఎడిట్ చేసి వీడియోలుగా పెడుతుంటే.. సామ్ ఫ్యాన్స్ మాత్రం దారుణంగా వారిద్దరీ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత.. నాగ చైతన్య- శోభితను ట్రోల్ చేస్తున్నట్టు ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

pillapichuka అనే ఇన్‌స్టా గ్రామ్ ఐడీ నుంచి విడుదలైన వీడియో ప్రకారం.. నాగ చైతన్య సమంత పెళ్లి ఫొటోలు పైన పెట్టి కింద చైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్ ఫోటోకు సమంత వీరి నిశ్చితార్థం చూసిన తర్వాత ఆమె రియాక్షన్ అంటూ ఓ వీడియో క్రియేట్ చేశారు. అంతే కాకుండా దానికి ‘ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీద ఉండగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా పోతివి’ అనే ఫోక్ సాంగ్‌ను యాడ్ చేసి వీడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా దీన్ని చూసిన సమంత ఫ్యాన్స్ కరెక్ట్‌గా సూట్ అయ్యే విధంగా ఎడిట్ చేశారని.. సమంత బంగారం నువ్వేం టెన్షన్ పడకు ఆ వేణు స్వామి గారు చెప్పాడు ఆమెతో సంసారం 2027 వరకే అట తర్వాత చైతన్య మళ్లీ నీ దగ్గరికీ వస్తాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to pillapichuka instagram id)

Advertisement

Next Story