‘నిహారికను పెళ్లి చేసుకుని చైతన్య మోసపోయాడు’ మెగా డాటర్ విడాకులపై నటి హాట్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-07-07 10:14:50.0  )
‘నిహారికను పెళ్లి చేసుకుని చైతన్య మోసపోయాడు’ మెగా డాటర్ విడాకులపై నటి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక భర్త చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొందరు నిహారికపై దారుణంగా సెటైర్లు కూడా వేస్తున్నారు.

తాజాగా, నాగబాబు, నిహారిక పై కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నాగబాబు రాజకీయాల్లో చాలా నీతులు చెబుతాడు. కానీ, తన ఇంట్లో కూతురును మాత్రం గాలికి వదిలేశాడు. కూతురినే కంట్రోల్ లో పెట్టుకోలేని వాడు రాజకీయాల్లో ఏం చేస్తాడు. ఆ నిహారిక తనకే పెళ్లి అయినట్టు పెద్ద బిల్డప్ కొట్టింది. కానీ, ఇప్పుడు విడిపోయాక లెక్కనే లేదు. ఆ మెగా కూతుర్లందరికీ ఇలానే పొగరు ఎక్కువ. భర్తలను అస్సలు పట్టించుకోరు. అందుకే అందరికీ విడాకులు అవుతున్నాయి. భర్తతో విడిపోయాక సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ తిరుగుతోంది. ఇలా తిరిగితే ఏ మగాడికైనా కోపమే వస్తుంది. అందుకే ఆ చైతన్య విడాకులకు అప్లై చేశాడు. అనవసరంగా అతను నిహారికను పెళ్లి చేసుకుని మోసపోయాడు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story