వెబ్ సిరీస్‌లకు సెన్సార్ తప్పనిసరి చేయాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి

by sudharani |   ( Updated:2023-01-07 11:14:15.0  )
వెబ్ సిరీస్‌లకు సెన్సార్ తప్పనిసరి చేయాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి
X

దిశ, సినిమా: మనకు తెలిసినంత వరకు ఏదైనా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటే తప్పనిసరిగా సెన్సార్ సభ్యుల పర్మిషన్ తీసుకోవాలి. సెన్సార్ సభ్యులు సినిమాను చూసి పరిశీలించి, అందులో అభ్యంతరకర సన్నివేశాలు, వాయిలెన్స్‌తో కూడిన సీన్స్ ఉంటే వాటిని తొలగిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మూవీస్ కంటే, వెబ్ సిరీస్ చాలా వస్తున్నాయి. కానీ వెబ్ సిరీస్‌లకు మాత్రం సెన్సార్ లేదు.

దీని గురించి రీసెంట్‌గా సీనియర్ నటి గౌతమి స్పందించింది. కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా పనిచేస్తుంది గౌతమి. ఈ క్రమంలో గౌతమి మాట్లాడుతూ. ''నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం వెబ్ సిరీస్‌లకు కూడా సెన్సార్ అవసరం. ఎందుకంటే సెన్సార్ లేకపోవడంతో సిరీ‌స్‌లో హింసాత్మకమైన సన్నివేశాలు, అభ్యంతరకర సన్నివేశాలు అలాగే ప్రసారం అవుతున్నాయి' అని అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed