వారం రోజుల్లో విడుదల.. ఆర్జీవీకి BIG షాకిచ్చిన సెన్సార్ బోర్డు

by sudharani |   ( Updated:2023-11-02 11:31:37.0  )
వారం రోజుల్లో విడుదల.. ఆర్జీవీకి BIG షాకిచ్చిన సెన్సార్ బోర్డు
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు ఆర్జీవీ ‘వ్యూహం’ మూవీకి సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది. అయితే.. ఈ సినిమాలోని పాత్రలకు నిజ జీవితాల్లో ఉన్న నేతల పేర్లను పెట్టడంపై అభ్యంతరం తెలిపిన బోర్డు.. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. కాగా, తాజా రాజకీయాల నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో సరిఫికెట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక వర్గానికి పూర్తిగా మద్దతు ఇచ్చినట్లు చూపించడంతో రాజకీయాలపై ప్రభావం పడే చాన్స్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story