- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cenema Tree : నేల కూలిన ‘సినిమా చెట్టు’.. ఎన్ని జ్ఞాపకాలను వదిలి వెళ్లిందో..
దిశ, సినిమా : ఎంతో మందికి నీడనిచ్చిన నిలువెత్తు జ్ఞాపకం ఇక లేదు. ఎన్నో సనిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించిన మహా వృక్షం ఇంకెప్పుడూ కనిపించదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 145 ఏండ్ల చరిత్ర కలిగిన ‘సినిమా చెట్టు’ ఇప్పుడొక చరిత్ర. ఎందుకంటే.. ఇటీవల కురుస్తున్న భారీ వర్షానికి అది నేలకొరిగింది. వర్షాలు, వరదలు, తుపానులు వంటివి వచ్చినప్పుడు చెట్లు కుప్పకూలడం సహజమే కదా అనుకుంటున్నారా? కావచ్చునేమో కానీ, ఇక్కడ నేలకొరిగింది మామూలు చెట్టు కాదు ‘సినిమా చెట్టు’!
అది తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, తాళ్లపూడి దగ్గరలోని కుమార దేవనం గ్రామం. పక్కనే గోదావరి నది ఒడ్డున ఓ అందమైన నిద్ర గన్నేరు చెట్టు. దీనిని ఒకప్పుడు మహాను భావుడు శ్రీ సింగలూరి తాతబ్బాయి గారు మొక్కగా నాటారని చెప్తారు. క్రమంగా పెరిగి మహా వృక్షమై ఎదిగింది. ఎన్నో వరదలను, తుపానులను, తట్టుకుంటూ ఎన్నో పక్షులకు, ఎంతో మంది మనుషులకు ఆశ్రయమిస్తూ వచ్చింది.
అందమైన ఆ నిద్ర గన్నేరు చెట్టు పేరు కూడా మరిచిపోయేంతగా అందరూ ‘సినిమా చెట్టు’ అని పిలుచుకునేవారు. ఎందుకంటే.. గోదావరి నది ఒడ్డున ఉండటంవల్ల సినిమా షూటింగ్‌లకు ఇదొక ప్రధాన ఆధారమైంది. అలనాటి సినిమాలైన పాడి పంటలు, దేవత, వంశవృక్షం, బొబ్బిలి రాజా, హిమ్మత్ వాలా, సీతా రామయ్యగారి మనవరాలు ఇలా.. లెక్క పెట్టుకుంటూ పోతే నాటి నుంచి నేటి వరకు మొత్తం 300 సినిమాల షూటింగులు, పాటల చిత్రీకరణ ఈ చెట్టు కిందే జరిగాయని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. అలాంటి మహా వృక్షం మొన్న ఆగష్టు 5న తుపాను గాలికి నేలకొరిగింది.
రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు, జంధ్యాల వంటి గొప్ప దర్శకులందరూ ఈ కుమార దేవనం గ్రామంలోని చెట్టు కింద సినిమాలు తీశారు. కెమెరా తీసుకొచ్చి చెట్టు కింద పెడితే చాలు ఫ్రేము దానంతట అదే వచ్చేస్తుంది అంటుండేవారు సినిమా డైరెక్టర్లందరూను. ఎందుకంటే గోదారి గట్టు, ఆ గట్టుపైన అందమైన నిద్ర గన్నేరు చెట్టు కలగలిసి అంత గొప్ప లొకేషన్ అది. పైగా ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీస్తే చాలు సినిమా సూపర్ హిట్టు అవుతుందన్న సెంటిమెంట్ కూడా ఉంది. ప్రముఖ దర్శకుడు వంశీ అయితే ఈ చెట్టు లేకుండా ఏ సినిమా తీయరంటే నమ్మండి. ఇప్పటి వరకు ఆయన మొత్తం 18 చిత్రాలను ఈ చెట్టుకిందే షూట్ చేశారు. అలాంటి చెట్టు ఇప్పుడు లేకుండాపోయిందన్న విషయం సినీ పరిశ్రమను, సినీ ప్రేక్షకులను విషాదంలో ముంచెత్తుతోంది. అవును ‘సినిమా చెట్టు’ ఇప్పుడొక చరిత్ర.