Mahesh Babu Birthday: ఈ సారి అభిమానులకు డబుల్ ట్రీట్..

by Anjali |   ( Updated:2023-07-02 10:09:38.0  )
Mahesh Babu Birthday:  ఈ సారి అభిమానులకు డబుల్ ట్రీట్..
X

దిశ, సినిమా: ఈ మధ్య స్టార్ హీరోలు తమ బర్త్ డేలను చాలా డిఫరెంట్‌గా జరుపుకుంటున్నారు. అభిమానులకు రిటర్న్ గిఫ్ట్‌లా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలను ఫ్యాన్స్ కోసం రీరిలీజ్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు మహేష్ బాబు టైం వచ్చింది. వచ్చే నెల ఆగస్టులో మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బిజినెస్‌మెన్’ను రీరిలీజ్ చేయనున్నారు మేకర్స్. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ హిట్ చిత్రం 4K వెర్షన్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే దీంతోపాటు మహేష్ బాబు చేస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ నుంచి కూడా అదిరిపోయే ట్రీట్ రెడీ అవుతుంది. అంటే ఈ సారి ఫ్యాన్స్‌కు డబుల్ గిఫ్ట్ అన్నమాట.

Advertisement

Next Story