బికినీలో దర్శనం ఇచ్చిన ఎమ్మెల్యే.. అందం చూసి షాక్ అవుతున్న నెటిజన్స్!

by Jakkula Samataha |   ( Updated:2024-05-03 07:51:53.0  )
బికినీలో దర్శనం ఇచ్చిన ఎమ్మెల్యే.. అందం చూసి షాక్ అవుతున్న నెటిజన్స్!
X

దిశ, సినిమా : ఎమ్మెల్యేగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ కేథరిన్ (Catherine Tresa) . అందం, అభినయం ఈమె సొంతం. ఈ బ్యూటీ 2013లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇద్దరమ్మాయిల సినిమా తర్వాత ఈ బ్యూటకీ అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పవచ్చు.ఈ సినిమాలో ఈ బ్యూటీ అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నటనతో అందరినీ ఆకట్టుకొని మంచి ఫేమ్ సంపాదించింది. ఇక ఈ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. పైసా, ఎర్రబస్సు, రుద్రమదేవి, సినిమాల్లో నటించింది కానీ ఈ అమ్మడుకు మంచి ప్యాన్ బేస్ సొంతం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సరైనోడు మూవీలో ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఈ ముద్దుగుమ్మ గ్రాఫ్ మరోసారి పెరిగిపోయింది. ఎమ్మెల్యే అనగానే ఈ బ్యూటీనే గుర్తు వచ్చే విధంగా ఆ పాత్రకు న్యాయం చేసింది. ఇక తర్వాత, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, వరల్డ్ ఫేమస్ లవర్, భళా తందనానా, బింబిసారా, మాచర్లనియోజక వర్గం వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించి.

అయితే తాజాగా మన స్టైలిష్ స్టార్ ఎమ్మెల్యే బికినీలో తన అందాలతో రచ్చ చేసింది. ఎర్రటి బికినీలో దోర జామపండులా ఉన్న ఈ ముద్దుగుమ్మ అందాలు చూస్తే ఎవ్వరికైనా సరే చెమటలు పట్టాల్సిందే. స్విమ్మింగ్ ఫూల్‌లో బికినీ వేసుకొని కొంటెగా చూస్తూ.. కుర్రకారును మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారందరూ బికినీలో ఎమ్మెల్యే సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కేథరిన్‌కు తెలుగులో అడపదడప అవకాశలు తప్పిస్తే, తన కెరీర్‌ నిలబెట్టే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. దీంతో ఈముద్దుగుమ్మ మలయాళ,కన్నడ, తమిళ చిత్రపరిశ్రమలో అవకాశాలు అందుకొని అక్కడ సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed