Allu Arjun: ‘పుష్ప 2’ గురించి ఒకే మాట తగ్గేదెలే.. అందరూ అలా.. కానీ స్టైలిష్ స్టార్ ఇలా.. బన్నీనా మజాకా !

by Prasanna |   ( Updated:2024-08-21 14:53:02.0  )
Allu Arjun: ‘పుష్ప 2’ గురించి ఒకే మాట తగ్గేదెలే.. అందరూ అలా.. కానీ స్టైలిష్ స్టార్ ఇలా.. బన్నీనా మజాకా !
X

దిశ, సినిమా : హీరోలందరూ ఒక మూవీ సెట్స్ పైన ఉండగానే మరో మూవీ కూడా ప్లాన్ చేసుకుంటారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అయితే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 3 సినిమాలు, ప్రభాస్ 4 సినిమాలు, చరణ్ 3 సినిమాలతో సినీ కెరీర్లో ఫుల్ బిజీ అయ్యారు. వరుస మూవీ అనౌన్స్మెంట్లు, కొత్త అప్డేట్స్ తో ఆడియెన్స్ ఫుల్ ఖుష్ అయ్యేలా చేస్తున్నారు.

పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. 3 ఏళ్ల నుంచి ఈ మూవీతో బన్నీ ఎంగేజ్ అయి ఉన్నారు. కాబట్టి, ఇది విడుదలయ్యాక అల్లు అర్జున్ కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటారని తెలుస్తుంది. కాబట్టి బన్నీ త్రివిక్రమ్ మూవీ ఈ ఏడాది సెట్స్ మీదకెళ్లే అవకాశమే లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప మూవీకి ఉత్తమ నటుడిగా బన్నీకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది.

ఇప్పుడు పుష్ప 2 ని కూడా ఆ రేంజ్ కి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు అర్ధమవుతుంది. పాన్ ఇండియాగా రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ఇంకా డైరెక్టర్ సుకుమార్ కూడా చిన్న షాట్ సరిగా రాకపోయినా అది మంచిగా వచ్చే వరకు 30, 40 షాట్స్ అయినా తీస్తున్నాడు. మొత్తం రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ మంచి బజ్ క్రియోట్ చేసాయి. ఈ మూవీ అయ్యాకే తన నెక్స్ట్ మూవీ గురించి చెప్పే అవకాశం ఉందని సన్నిహితులు అంటున్నారు.

Read More..

Allu Arjun: ఆయ్ మూవీ హీరోని అభినందించిన బన్నీ.. ఆ ఫొటోల్లో అల్లు అర్జున్ షర్ట్‌ పై అమ్మాయిని గమనించారా?

Advertisement

Next Story