నేషనల్ అవార్డు తర్వాత ఆ స్టార్ కమెడియన్‌తో బన్నీ స్పెషల్ మీట్.. ఎందుకో తెలుసా..?

by sudharani |   ( Updated:2023-08-26 03:41:07.0  )
నేషనల్ అవార్డు తర్వాత ఆ స్టార్ కమెడియన్‌తో బన్నీ స్పెషల్ మీట్.. ఎందుకో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసిన, ఎక్కడ విన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది. తాజాగా ఆయన జాతీయ అవార్డు దక్కించుకోవడంతో సోషల్ మీడియా వేదికగా బన్నీకి ప్రశంసల జల్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే.. ఈ పరిస్థితుల నడుమ అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందాన్ని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. నేషనల్ అవార్డు వచ్చిన సంబరాల్లో ఉన్న బన్నీ.. ఈ టైంలో బ్రహ్మానందాన్ని కలవడం ఏంటని నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే.. దీనికి ఓ పర్ఫెక్ట్ రీజన్ ఉంది.

ఇటీవల బ్రహ్మానందం ఇంటిలో పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే. బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్దార్థ్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ పెళ్లి వేడుకకు బన్నీ హాజరు కాలేకపోవడంతో.. తాజాగా బ్రహ్మానందం ఇంటికి వెళ్లి కలిశారు. ఆ కుటుంబంతో కాసేపు ముచ్చటించారు. బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడంతో బ్రహ్మానందం కుటుంబం ప్రత్యేకంగా గజమాలతో బన్నీని సత్కరించింది. కాగా.. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Khushi సినిమా samantha రియల్ లైఫ్ స్టోరీ నుంచి తీసుకున్నారా.. మరి ఆ సీక్రెట్లు కూడా లీక్ చేస్తారా?

Advertisement

Next Story