RRR రికార్డులు బద్దలు కొట్టిన బన్నీ ‘పుష్ప-2’..

by sudharani |   ( Updated:2023-06-07 14:29:01.0  )
RRR రికార్డులు బద్దలు కొట్టిన బన్నీ ‘పుష్ప-2’..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమా ‘ఫుష్ప-2’. ‘పుష్ప’ సెన్సెషనల్ హిట్ కొట్టడంతో ఇప్పుడు దాని సిక్వెల్‌గా వస్తు్న్న ‘పుష్ప-2’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా నుంచే వచ్చే ఒక్కో అప్‌డేట్స్ మూవీపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. దీంతో ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ‘పుష్ప-2’ సినిమా రిలీజ్ విషయమై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

పుష్ప-2 అన్ని బాషాలకు చెందిన ఆడియో రైట్స్‌ను ప్రముఖ సంస్థ టీ సిరీస్ రూ. 65 కోట్లకు దక్కించుకుందట. అయితే RRR సినిమా ఆడియో హక్కులు కేవలం రూ. 30 కోట్లకు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో RRR రికార్డులను అల్లు అర్జున్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త కాస్త నెట్టింట వైరల్ కావడంతో బన్నీ ఫ్యాన్ పండుగా చేసుకుంటున్నారు.

Also Read..

హీరో ప్రభాస్ పై కృతి సనన్ హాట్ కామెంట్స్

Advertisement

Next Story