Tarun Bhaskar: నటనపై ఇంట్రెస్ట్ ఉన్నవారికి అదిరిపోయే అవకాశం.. ఆ సినిమాలో చాన్స్!

by sudharani |   ( Updated:2024-08-02 15:30:11.0  )
Tarun Bhaskar: నటనపై ఇంట్రెస్ట్ ఉన్నవారికి అదిరిపోయే అవకాశం.. ఆ సినిమాలో చాన్స్!
X

దిశ, సినిమా: ‘పెళ్లి చూపులు’ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్.. మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. అదే స్పీడ్‌లో తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గత ఏడాది వచ్చిన ‘కీడాకోలా’ చిత్రంతో ఫ్లాప్ అందుకున్న ఈయన.. దర్శకుడిగా చాలా లాంగ్ గ్యాప్ ఇచ్చి.. ప్రజెంట్ నటుడిగా బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ‘దూత’ వెబ్ సిరీస్‌లో కూడా విలన్‌గా అదరగొట్టి.. ప్రజెంట్ నటుడిగా పలు అవకాశాలు అందుకుంటున్నాడు.

ఇందులో భాగంగా తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో మరో చిత్రం చేస్తున్నారు. ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వంశీరెడ్డి దొండపాటిని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. యారో సినిమాస్ & డోలాముఖి సబ్‌బల్ట్రాన్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై బూసం జగన్ మోహన్ రెడ్డి & వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంటర్‌టైన్మెంట్, ఎమోషనల్ డెప్త్‌తో కూడిన ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. అంతే కాకుండా కొత్త టాలెంట్‌ని డిస్కవర్ చేయడానికి నటీనటుల కోసం టీమ్ ఓపెన్ కాస్టింగ్ కాల్‌ని అనౌన్స్ చేసింది. ఇడుపు కాయితం అంటూ రూ. 50 ల బాండ్ పేపర్‌పై ఇంటరెస్టింగ్ విషయాలు వివరించారు.

‘ఇడుపు కాయితం.. తేదీ 12-12-2024 బీస్తారం రోజున ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి గుడి వెనుక సమ్మక్క సారలమ్మ గద్దెలకాడ, మర్రిచెట్టు కింద జమ్మికుంట వాస్తవ్యులైన బూర సమ్మయ్య గౌడ్ బిడ్డ శ్రీలతకు పొత్కపల్లి గ్రామ వాస్తవ్యులైన గొడిశాల పోశాలు కొడుకు శ్రీనివాస్ గౌడ్‌కి ఇడుపు కాయితం పంచాయితీ జరుగుతుంది. ఆ పంచాయితీ పెద్దలుగా, సాక్ష్యులుగా, కుటుంబ సభ్యులుగా నటించడానికి నటీనటులు కావాలే... 20 నుంచి 60 మధ్య వయసుగల వారికి అవకాశం కలదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు 9032765555 ని సంప్రదించండి’ అంటూ క్యాస్టింగ్ కాల్‌ని రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ సైతం వైరల్ అవుతోంది.

Advertisement

Next Story