- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్న Bro కలెక్షన్లు.. విశ్లేషకుల అంచనా!
దిశ, వెబ్‌డెస్క్: మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో పవన్ కల్యాణ్ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ వైపు భారీ వర్షాలు పడుతున్న మెగా అభిమానులు ఎక్కడా తగ్గడం లేదు. థియేటర్లలో క్యూ కట్టారు. దీంతో ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీసు బద్దలైంది. వన్డే వర్ల్డ్ వైడ్ దాదాపు రూ. 49 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఓపెనింగ్ డేనే ఇన్ని కోట్లంటే మంచి కలెక్షనే అని చెప్పుకోవచ్చు. కాకపోతే పవన్ కల్యాణ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది తక్కువే. డిజాస్టర్ అయిన ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 61 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ తీవ్రంగా నిరాశపరచడంతో కాస్త గ్యాప్ తీసుకొని రాజకీయాల్లో బిజీ అయ్యారు పవన్.
ఆ తర్వాత మళ్లీ ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.54కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. అనంతరం తెరకెక్కిన ‘బీమ్లా నాయక్’ 57కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. అయితే నిజానికి టికెట్ ధరల పెంపు అనుకూల వాతావరణం ఉండుంటే కనుక బ్రో సినిమా బీమ్లా నాయక్‌ను దాటేసేది. ఈ సినిమా తమిళ్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. బీమ్లా నాయక్ మూవీ తర్వాత పవన్ చేసిన చిత్రం.. విరూపాక్ష లాంటి హిట్ తర్వాత తేజ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెంచేసుకున్నారు.
ఇక మొన్న థియేటర్స్‌కు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇది మొదటి రోజునే భారీ ఓపెనింగ్‌ను సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా 49కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిందని గ్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే వర్షాల కారణంగా 20కోట్ల వసూళ్లు మాత్రమే చేస్తుందని అంచనా వేశారు. కానీ అంచనాలకు తలక్రిందులు చేస్తూ నైజాం ఎరియాలో ఇది రూ. 8 కోట్ల నుంచి 9 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందని టాక్. ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన విషయం తెలిసిందే. ఇక బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. అయితే రాను రాను ఈ మూవీ అత్యంత భారీ కలెక్షన్లు రాబట్టనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: ‘Baby’ హీరోయిన్‌ను కలిసిన డైరెక్టర్ Harish Shankar.. Pawan సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్టేనా!