బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న అన్నదమ్ములు.. ధనుష్ V/S సెల్వరాఘవన్!

by Harish |   ( Updated:2023-02-18 08:51:52.0  )
బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న అన్నదమ్ములు.. ధనుష్ V/S సెల్వరాఘవన్!
X

దిశ, సినిమా: ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సార్'. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీ విద్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఫిబ్రవరి 17న విడుదల కానుంది. అయితే ఇదే రోజున మరో సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. అది కూడా ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ సినిమా కావడం విశేషం. డైరెక్టర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సెల్వ రాఘవన్ నటించిన 'బకాసురన్' మూవీ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి మోహన్ జి దర్శకత్వం వహించారు. ఇక మొదటి సారిగా బాక్సాఫీస్ వద్ద ఈ అన్నదమ్ములు ఢీ అంటే ఢీ అంటూ పోటిపడబోతున్నారు.

Advertisement

Next Story