Britney Spearsపై దాడి.. రెస్టారెంట్‌లో విక్టర్ సిబ్బంది అత్యుత్సాహం..

by samatah |   ( Updated:2023-07-07 09:58:23.0  )
Britney Spearsపై దాడి.. రెస్టారెంట్‌లో విక్టర్ సిబ్బంది అత్యుత్సాహం..
X

దిశ, సినిమా: లాస్ వెగాస్‌లోని ఓ రెస్టారెంట్‌లో బ్రిట్నీ స్పియర్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. NBA స్టార్ (ఫ్రెంచ్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్) విక్టర్ వెంబన్యామా అదే రెస్టారెంట్‌కు రాగా.. తనను గుర్తించి ఫొటో కోసం వెళ్లిన బ్రిట్నీపై విక్టర్ భద్రత సిబ్బంది దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విక్టరీ కూర్చున్న చోటుకు వెనకనుంచి వెళ్లిన బ్రిట్నీ.. సెల్ఫీ కోసం అతని వీపును తట్టేలోపు భద్రతా బృందంలోని ఒక సభ్యుడు ఆమెను అకస్మాత్తుగా వెనక్కి లాగేశాడు. దీంతో బ్రిట్నీ నేలపై జారిపడిపోగా ఆమె అద్దాలు పగిలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు వెల్లడించారు. అయితే కాసేపటికి బ్రిట్నీని గుర్తించిన ఆయన సిబ్బంది.. ఆమె టేబుల్ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారట. అభిమానులు గుంపుగా రావడంతో తనను గమనించలేకపోయామని పశ్చాత్తాపం వ్యక్తం చేశారని పలు నివేదికలు వెల్లడించాయి.

Read More: ‘గదర్ 2’ వివాదం.. అమీషా ఆరోపణలపై నిర్మాత రియాక్షన్ ఇదే.. మంచి పని చేసిందిలే అంటూ..

Advertisement

Next Story