సింగర్స్ వార్.. క్షమాపణలు చెప్పిన బ్రిట్నీ స్పియర్స్

by sudharani |   ( Updated:2022-09-14 11:43:49.0  )
సింగర్స్ వార్.. క్షమాపణలు చెప్పిన బ్రిట్నీ స్పియర్స్
X

దిశ, సినిమా : అమెరికన్ సింగర్ అండ్ యాక్ట్రెస్ క్రిస్టినా అగ్యిలెరా బ్రిట్నీ స్పియర్స్‌ను బ్లాక్ చేసింది. ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఆమె.. తనతోపాటు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్స్‌ను కూడా బ్రిట్నీ బాడీ షేమ్ చేసిందని చెప్పుకొచ్చింది. కాగా దీనిపై స్పందించిన బ్రిట్నీ.. 'క్రిస్టినా యొక్క అందమైన శరీరాన్ని నేను ఏ విధంగానూ విమర్శించలేను. ఆమె ప్రదర్శనను చూసినప్పుడు నేను గమనించిన ప్రధాన విషయం వేదికపై సింగర్స్ మధ్య తేడా.

అయినా నేను క్రిస్టినా గురించి ఇంతకు ముందు పోస్ట్‌లో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. నిజానికి ఈ పవర్‌ఫుల్ బ్యూటీ ద్వారా ప్రేరణ పొందాను. ధన్యవాదాలు' అని తెలిపింది. గతంలో మీడియా, పేరెంట్స్ తనను ట్రీట్ చేసిన విధానానికి డిప్రెషన్‌లోకి వెళ్లిన తీరును మాత్రమే ఆ వీడియోలో వివరించానని చెప్పింది. తానెవరినీ బాడీ షేమింగ్ చేయాలనుకోనని, ఆ బాధేంటో తనకు తెలుసని పోస్ట్ పెట్టింది బ్రిట్నీ.

ఇవి కూడా చ‌ద‌వండి :

వక్షోజాలపై చేతులు.. స్పోర్ట్స్ బ్రాలో సూపర్ హాట్‌గా..

హింసాత్మక సెక్స్.. భయపడిపోయిన యంగ్ బ్యూటీ

Advertisement

Next Story