మెగా డాటర్ విడాకులు నిజమే.. కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ వేసిన నిహారిక!

by Anjali |   ( Updated:2023-07-04 14:53:37.0  )
మెగా డాటర్ విడాకులు నిజమే.. కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ వేసిన నిహారిక!
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా మెగా డాటర్ నిహారిక తన భర్తతో విడిపోతున్నట్లు నెట్టింట తెగ ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని జైపూర్‌లో చైతన్య, నిహారికల విహహం అంగరంగ వైభవంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఈ జంట ఒక్కటైంది. రెండేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ తర్వాత మనస్పర్థలు ప్రారంభమైనట్లుగా ఇండస్ట్రీలో కలకలం రేగింది. అయితే నిహారిక- చైతన్య మ్యూచువల్ అంగీకారంతో విడాకులకు తీసుకునేందుకు మే 19న హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కోర్టులో పిటిషన్ వేసినట్లు తాజాగా వార్తలు విస్తృతం అయ్యాయి.

అయితే, ఇరు కుటుంబాల్లోని పెద్దలు వీరిని కలపడానికి చాలా ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో చివరికి విడాకులు తీసుకునేందుకే ఈ జంట సిద్ధమైంది. విడాకులకు ముందుగా నిహారిక స్వయంగా దరఖాస్తు చేయడంతో వీరి విడాకులు ఖాయమైపోయాయి. అయితే, ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన నిహారిక, చైతన్యల పెళ్లి.. మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోవడంతో మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more: ఉదయ్ కిరణ్‌తో చిరంజీవి పెద్ద కూతురు మూవీ కూడా తీసింది.. అప్పుడే అలా జరిగింది.

Advertisement

Next Story