BREAKING: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం.. జైలు నుంచి నటి హేమ విడుదల

by Shiva |   ( Updated:2024-06-14 13:57:05.0  )
BREAKING: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం.. జైలు నుంచి నటి హేమ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన తెలుగు సినీ నటి హేమకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవ్ పార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషించడంతో పాటు పార్టీలో డ్రగ్స్ వాడకంపై పోలీసులు వేసిన చార్జ్‌షీట్‌పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టులో బలంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హేమా ఆ రోజు రాత్రి రేవ్ పార్టీలో పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేశారు. ఇరు పక్షాల వాదోపవాదలు విన్న ధర్మాసనం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉండగా బెయిల్ మంజూరు అవ్వడంతో శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలైంది.

Advertisement

Next Story