బాలయ్య కూతురిని మొదటి చూపులోనే ప్రేమించా.. అసలు విషయం బయటపెట్టిన లోకేష్ (వీడియో)

by Dishaweb |   ( Updated:2023-08-20 15:45:41.0  )
బాలయ్య కూతురిని మొదటి చూపులోనే ప్రేమించా.. అసలు విషయం బయటపెట్టిన లోకేష్ (వీడియో)
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ పెద్ద కూతురు బ్రహ్మణి పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని బ్రాహ్మణి వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాగే అమ్మగా, హౌస్ వైఫ్‌గా, బిజినెస్ ఉమెన్‌గా వేర్వేరు రంగాలలో సత్తా చాటుతున్న ఆమె.. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇటీవల తన భర్త నారా లోకేష్ ఓ మీటింగ్‌‌లో పాల్గొన్నగా ఓ అమ్మాయి మాట్లాడుతూ.. ‘బ్రహ్మణిగారితో పెళ్లి ప్రతిపాదన మొదట ఎవరు తీసుకొచ్చారు?’ అని ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా ఎగ్జయిట్ అయిన లోకేష్.. ‘నాది బ్రహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మామయ్య భయంతో బయటపెట్టలేకపోయా. తర్వాత అమ్మనాన్న చర్చలు జరిపిన తర్వాత నా అభిప్రాయం అడిగారు. మొత్తంగా బ్రాహ్మణి, నేను మొదటి చూపులోనే ప్రేమించుకున్నాం. బ్రాహ్మణి పెళ్లి ప్రతిపాదనను అంగీకరించడంతో మిగిలినది చరిత్రగా మారింది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story