త‌రుణ్ భాస్కర్‌‌ను జంధ్యాలతో పోల్చిన బ్రహ్మానందం.. ఆ విషయంలో ఇగో అడ్డొచ్చిదంటూ

by Nagaya |   ( Updated:2023-11-01 03:51:09.0  )
త‌రుణ్ భాస్కర్‌‌ను జంధ్యాలతో పోల్చిన బ్రహ్మానందం.. ఆ విషయంలో ఇగో అడ్డొచ్చిదంటూ
X

దిశ, సినిమా: సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ పనితీరుపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు తరుణ్ భాస్కర్ స్వీయ‌ ద‌ర్శక‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’. సరికొత్త క్రైమ్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మనందం, చైత‌న్య రావు, రాగ్ మ‌యుర్ ప్రధాన పాత్రల్లో న‌టించగా ద‌గ్గుబాటి రానా సమర్పణలో న‌వంబ‌ర్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన బ్రహ్మానందం.. ‘నేను ఈ సినిమాలో న‌టించడానికి ఒకే ఒక కారణం తరుణ్ భాస్కర్. ఎందుకంటే తరుణ్ గతంలో తీసిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు నాకు బాగా నచ్చాయి. ఇలాంటి యువ దర్శకులతో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. కానీ నేనే వెళ్లి సినిమాలో ఛాన్స్ అడగాలంటే నా ఇగో అడ్డు వ‌చ్చింది. వాళ్లే వచ్చి నన్ను అడిగితే బాగుండు అనుకునేవాడిని. తరుణ్ ఇందులో నటించమని అడిగినపుడు చాలా సంతోషంగా అనిపించింది. ఈ మూవీ టీమ్ అంతా నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. జంధ్యాల గారితో నేను సినిమా చేసినప్పుడు ఎంత హాయిగా.. ఎంత అందమైన కామెడీ పండిందో.. కీడా కోలా చేస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగింది. నాకు జంధ్యాల గారితో కలిసి పనిచేసిన రోజులు గుర్తొచ్చాయి’ అంటూ దర్శకుడిని తెగ పొగిడేశాడు బ్రహ్మీ. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story