మనం పిలుపునిస్తే వచ్చే బ్యాచ్ కాదు..బ్రహ్మానందం సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2024-05-14 14:12:15.0  )
మనం పిలుపునిస్తే వచ్చే బ్యాచ్ కాదు..బ్రహ్మానందం సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటల నుంచి జరిగింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీలో ఓటు హక్కు వినియోగించుకున్న హాస్య నటుడు బ్రహ్మానందం మీడియాతో మాట్లాడుతూ జోక్ చేశారు. ఈ క్రమంలో ఓటు వేసి బయటకు వచ్చిన బ్రహ్మానందం కు ఓ విలేకరి ప్రశ్నలు వేశారు. దీనికి బ్రహ్మానందం నవ్వుతూ, నవ్విస్తూ సమాధానం చెప్పారు. హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంపై బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ తక్కువ అయితే నేనేం చేయను మనం పిలుపునిస్తే వచ్చే బ్యాచ్ కాదు. రావాలనుకుంటే వస్తారు అంటూ జవాబు ఇచ్చారు. నేనెవరికీ ఏం చేప్పాను. ప్రమాణ పూర్తిగా ఓటేశాను. కావాలంటే చూసుకోండి అంటూ బ్రహ్మీ చెప్పారు. ఓటు హక్కును అందరూ బాధ్యతగా భావించి వినియోగించుకోవాలని అన్నారు.

Advertisement

Next Story