Brahmamudi : అమ్మవారి వేషంలో కనకం

by Prasanna |   ( Updated:2024-05-03 14:35:11.0  )
Brahmamudi : అమ్మవారి వేషంలో కనకం
X

దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

అమ్మని కాదు నేను అమ్మవారిని అని కనకం అంటుంది. ‘అమ్మవారి గెటప్‌లో ఉన్న మీ అమ్మనేనే’ అంటూ.. స్వప్న ఎంతకీ నమ్మకపోవడంతో తన డబ్బా ఫోన్‌ని చూపిస్తుంది కనకం. అప్పుడు స్వప్న నమ్ముతుంది.. ఈ గెటప్ అయితే బాగా వర్క్ అవుట్ అవుతుందని నేను వేసుకొచ్చాను అని అంటుంది కనకం.

‘సరే ముందు వెళ్లి పని చెయ్ అంటూ వడ్డీ వ్యాపారి ఉన్న గదిలోకి పంపిస్తుంది స్వప్న తల్లిని. ఇక కనకం గురించి మనకి తెలిసిందే.. కొంచం యాక్షన్ చేయమంటే.. ఓవర్ యాక్షన్ చేస్తుంది.. తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ.. ఆ వ్యాపారి గురకపెట్టి నిద్రపోతుంటే.. త్రిశూలం మెడ మీద పెట్టి అతడిని నిద్ర లేపుతుంది.

వాడు పైకి లేవడానికి వీలు కాకుండా.. పొట్ట మీద కాలు పెట్టి.. ‘ ఈ త్రిశూలం నీ గుండెల్లో దించుతానురా’ అంటూ పూనకం వచ్చినట్లుగా ఆయాసపడుతుంది. ఇక కనకం ఆయాసపడుతూ ఆవేశపడుతూ భలే కామెడీగా ఉంటుంది. ‘ఓరి నీచుడా.. మోసాలు చేస్తూ పాపాలు చేస్తూ నాకు దన్నం పెడితే.. నేను ఎలా క్షమిస్తాను అనుకున్నావారా.. ఆస్తి పేపర్స్ నీ దగ్గరే ఉన్నాయి కదా? చెప్పు ఎందుకు మోసం చేశావ్?’ అంటూ రెచ్చిపోతుంది.

Advertisement

Next Story