Brahmamudi ఆగస్ట్ 19 ఎపిసోడ్ : నువ్వు ఎంత నీ స్థాయి ఎంతంటూ.. కావ్యను ఇంట్లో నుంచి గెంటేసిన రాజ్

by Prasanna |   ( Updated:2023-08-19 05:23:03.0  )
Brahmamudi  ఆగస్ట్ 19 ఎపిసోడ్ : నువ్వు ఎంత నీ స్థాయి ఎంతంటూ.. కావ్యను ఇంట్లో నుంచి గెంటేసిన రాజ్
X

దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి నేటి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

రాజ్, కావ్య కలిసి మట్టి తొక్కుతున్న వీడియోను రుద్రాణి, అపర్ణకు చూపిస్తుంది రుద్రాణి. అప్పుడే రాజ్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతుంది. ఆ కావ్యకు ఎంత ధైర్యం ఉంటే.. నా కొడుకుతో మట్టి తొక్కిస్తుందంటూ ఆవేశంతో ఊగిపోతోంది.

నీ మీద మోజుతో నిన్ను పెళ్లి చేసుకోలేదు? మా ఇంట్లో వాళ్లు చెప్పినందుకు నా గదిలోకి రానిచ్చాను, కానీ నువ్వు మాత్రం మా ఇంటి పరువు మొత్తం తీస్తున్నావ్.. వాళ్లని అడ్డుపెట్టుకుని నీ ఇష్టమొచ్చినట్టు చేస్తున్నావ్.. అసలు నువ్ నాకు భార్యగా నచ్చనప్పుడు, మా అమ్మ నిన్ను కోడలిగా ఎందుకు అంగీకరించాలని రాజ్ కోపంగా అడుగుతాడు. అస్తమానం నీ పుట్టిల్లు, నీ ఆత్మగౌరవం అంటూ మమ్మల్ని బజారుకు ఎక్కించావ్, అయినా కూడా మా అమ్మ సైలెంట్ గానే ఉంది , నువ్ ఎంత నీ స్థాయి ఎంత అంటూ గట్టిగా అరుస్తాడు రాజ్. నీకిచ్చిన స్వేచ్ఛను నువ్వు ఉపయోగించుకోకపోవడం నీ తప్పు? ఇదంతా కావాలనే చేసుకున్నావ్? ఈ ఇంటికి ఓ విలువు గౌరవం ఉన్నాయి , ఇన్ని తప్పులు చేసిన నీకు ఈ ఇంట్లో అర్హత లేదని చెప్పి కావ్య బయటకు గెంటేస్తాడు. కావ్యకు ఏం మాట్లాడాలో అర్థంకాదు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed