Prabhas 'Salaar' update : బిగ్ అప్డేట్ రివీల్ చేసిన బ్రహ్మాజీ?

by samatah |   ( Updated:2023-07-24 05:27:37.0  )
Prabhas Salaar update :  బిగ్ అప్డేట్ రివీల్ చేసిన బ్రహ్మాజీ?
X

దిశ, వెబ్‌డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతోగానో ఎదురు చూస్తున్నారు.

ఇక రీసెంట్ గా సలార్ మూవీ నుంచి టీజర్ విడుదల అవ్వగా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో బిగ్ అప్డేట్ రివీల్ అయ్యింది. తాజాగా నటుడు బ్రహ్మాజీ ఈ సినిమాలో నటించబోతున్నట్లు తానే స్వయంగా వెళ్లడించాడు.

స్టార్ హీరోలతో పాటు నేటి యువ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న ఈయన ప్రస్తుతం తన తనయుడు హీరోగా నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ .. ఈ సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలోనే సలార్ లో తాను నటించబోతున్నట్లు తెలిపారు. బ్రహ్మాజీ ఇందులో గ్రే షేడ్ రోల్ పోషించబోతున్నట్లు అంటే స్వతహగా ఆయన పాత్ర పాజిటివ్ అయినా కూడా కొంచెం మాస్‌గా నెగటివ్ షేడ్స్ ఉన్నట్లు కనిపించబోతుందని అర్థం.

Read More :1.పాన్ ఇండియా మూవీలో చిరంజీవి.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

2.Rakul Preet Singh :: గ్రీన్ బికినీలో హాట్ థైయ్స్ చూపిస్తూ రెచ్చిపోయిన...

Advertisement

Next Story