‘బ్రహ్మాఆనందం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పంచె కట్టులో అదిరిపోయిన కమెడియన్ లుక్

by Hamsa |   ( Updated:2024-08-16 14:20:43.0  )
‘బ్రహ్మాఆనందం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పంచె కట్టులో అదిరిపోయిన కమెడియన్ లుక్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి జనాలను నవ్వించారు. అంతేకాకుండా పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. కానీ గత కొద్ది రోజుల నుంచి బ్రహ్మానందం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం బ్రహ్మానందం నటిస్తున్న చిత్రం బ్రహ్మా ఆనందం.

ఈ సినిమాలో ఆయన తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటిస్తుండగా.. ఆర్‌విఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే దీనిని స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే బ్రహ్మా ఆనందం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌కు దక్కించుకున్నాయి. తాజాగా, ఈ సినిమా నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ విడుదల అయింది.

ఈ ఫొటోను రాజా గౌతమ్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. అంతేకాకుండా ఆయనతో నటించడం అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అనే విధంగా క్యాప్షన్ జత చేశాడు. ఇక ఆయన షేర్ చేసిన పోస్టర్‌లో బ్రహ్మానందం పంచెకట్టుకుని స్పెడ్స్ పెట్టుకుని నడుస్తున్నట్లు ఉంది. అయితే ఇందులో బ్రహ్మానందం, రాజా గౌతమ్ తాత మనవడుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రజెంట్ బ్రహ్మానందం లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

(Video Link Credits to rajagoutham Instagram Channel)

Advertisement

Next Story