- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయనిధి స్టాలిన్ ఎఫెక్ట్.. ‘జవాన్’ను బాయ్‍కాట్ చేయాలంటూ నినాదాలు
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’. ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమాను బహిష్కరించాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కారణమేమిటంటే తమిళనాడు క్రీడాశాఖ మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్‍కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో ఈ మూవీ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో ఆ సంస్థ ‘జవాన్’ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇది తెలుసుకున్న కొందరు ఈ చిత్రాన్ని బహిష్కరించాలంటున్నారు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఓ సభలో ఉదయనిధి మాట్లాడటమే ఇందుకు కారణం. కాగా ఈ కామెంట్లపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. దీంతో ఈ ప్రభావం ‘జవాన్’పై కూడా పడటంతో ‘బాయ్‍కాట్ జవాన్’ ట్రెండ్ మొదలైంది. ఉదయనిధికి నష్టం వాటిల్లేలా సినిమాను బాయ్‍కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.