ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేస్: ఈడీ లేఖ రాసిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్

by Satheesh |   ( Updated:2023-10-05 12:58:47.0  )
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేస్: ఈడీ లేఖ రాసిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్ లైన్ గేమింగ్ యాప్ కేసు ఆరోపణలపై విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో రెండు వారాల గడువు కావాలని బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ఈడీని కోరారు. ఈ మేరకు గురువారం ఈడీ అధికారులకు ఆయన లేఖ రాశారు. దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న మహదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ యాప్‌కు రణ్ బీర్ కపూర్ ప్రచార కర్తగా ఉన్న నేపథ్యంలో అక్టోబర్ 6న విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై స్పందించిన రణ్ బీర్ కపూర్ విచారణకు మరికొంత గడువు కావాలని దర్యాప్తు సంస్థకు విజ్ఞప్తి చేశారు. మరి రణ్ బీర్ కపూర్ విజ్ఞప్తిపై ఈడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.

Advertisement

Next Story