మ‌హేష్, త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో..?

by Dishaweb |   ( Updated:2023-05-22 10:45:31.0  )
మ‌హేష్, త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో..?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మ‌హేష్‌కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ మూవీ అంటే హీరోతో పాటు, ప్రతీ క్యారెక్టర్‌కు బలమైన పాత్ర ఉంటుంది. మరి ఇదే అప్‌డేట్ నిజమైతే అక్షయ్ కోసం ఎలాంటి పాత్ర రాశాడో చూడాలి.

Read More: ట్విట్టర్ ఎకౌంట్ డిలీట్ చేసిన ‘సలార్’ డైరెక్టర్, ప్రొడ్యూసర్

Advertisement

Next Story