అంబానీని మించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్

by Prasanna |   ( Updated:2023-08-01 08:59:48.0  )
అంబానీని మించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్
X

దిశ, సినిమా: ఇండియాలో టాప్ ట్యాక్స్ పేయర్స్ ఎవరనే క్వశ్చన్ వస్తే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా లేదంటే ఇతర పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తారు. కానీ అది తప్పు.. ఇండియాలో ఎక్కువగా ట్యాక్స్ కట్టేది ఓ బాలీవుడ్ హీరో. ఈ ఏడాది ఐటీ రిటర్న్ (ITR) దాఖలు చేయడం జూలై 31తో కంప్లీట్ కాగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు రూ. 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం వరకు దాదాపు రూ. 27 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని తెలిపారు. ఇందులో భాగంగా రిటర్న్ ఫైలింగ్‌లో దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించింది బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అని తెలిపారు. అవును ఆదాయపు పన్ను శాఖ అందించిన డేటా ప్రకారం.. అక్షయ్ కుమార్ గత సంవత్సరం అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా ఉన్నారు. 2022లో రూ. 29.5 కోట్ల ఆదాయపు పన్నును డిపాజిట్ చేశారు. ఈ ఏడాది తన ఆదాయాన్ని రూ.486 కోట్లుగా ప్రకటించారు. ఇక ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా దేశంలోని టాప్ ట్యాక్స్ పేయర్స్ ఎందుకు కాదు? వారు కుబేరులు కదా అనే ఆలోచన మీకు రావచ్చు. కానీ ఈ పారిశ్రామికవేత్తలు వ్యక్తిగత ఆస్తులను తక్కువగా చూపిస్తారు.

Advertisement

Next Story