- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాకు బాలీవుడ్ షాక్..
దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రొడ్యుసర్ విక్రమ్ రెడ్డి కలిసి ‘V MegaPictures’ అనే బ్యానర్‌ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘V MegaPictures’ నుంచి మొదటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు ‘ది ఇండియా హౌస్’ టైటిల్‌ను ఖరారు చేస్తూ... మోషన్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. ఈ సాలిడ్ ప్రాజెక్ట్‌లో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా.. బాలీవుడ్ నుంచి మాత్రం రామ్ చరణ్‌కు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. అదేంటంటే..
బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రణదీప్ హుడా ‘వీర్ సావర్కర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధం కాగా.. తాజాగా ‘సావర్కర్’ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఫీడ్రమ్ ఫైటర్స్‌ను ప్రేరేపించిన గొప్ప నాయకుడు సావర్కర్.. అలాంటి నాయకుడిని ఎవరు, ఎందుకు చంపేసారు’’ అంటూ టీజర్‌ను రణదీప్ ప్రెజెంట్ చేశాడు. అయితే.. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే.. అటూ రామ్ చరణ్, రణదీప్ హుడా ఇద్దరు ఒకే పాయింట్‌లో కథని తీస్తున్నట్లు అనిపిస్తోంది. మరి రెండు సినిమాలు ఒకటేనా.. లేక వేరువేరు ఉంటాయా అనేది ‘వీర్ సావర్కర్’ రిలీజ్ వరకు వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ కథ ఒకటే అయితే బాలీవుడ్ నుంచి రామ్ చరణ్‌కు షాక్ తగిలినట్లే అవుతుంది. చూడాలి మరి ఏమవుతుందో.
Read More... దేవకన్యను తలపిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!