Venkatesh: ఇన్నేళ్లకు జతకట్టిన వెంకటేష్-భూమిక!

by Prasanna |   ( Updated:2023-03-13 14:50:57.0  )
Venkatesh: ఇన్నేళ్లకు జతకట్టిన వెంకటేష్-భూమిక!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. తమిళ సినిమా ‘వీరమ్‌’కు హిందీ రీమెక్‌గా వస్తున్న ఈ మూవీకి ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహించాడు. ఇందులో సల్మాన్ సరసన పూజాహెగ్డే నటిస్తుండగా.. షెహనాజ్ గిల్, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఆ మూవీ నుంచి ‘బిల్లి బిల్లి’ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సాగిన ఈ అందమైన పెళ్లి పాటకు సంబంధించిన వీడియో ఆకట్టుకుంటుంది. కాగా ఈ పాటలో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ భూమిక కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. పాటలో ఈ జంట అందంగా నవ్వుతూ ప్రత్యక్షమయ్యారు. చాలా కాలం తర్వాత వెంకీ అండ్ భూమిక కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story