మాజీ విశ్వసుందరికి గుండెపోటు

by Hamsa |
మాజీ విశ్వసుందరికి  గుండెపోటు
X

దిశ, డైనమిక్ బ్యూరో : బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ షాకింగ్ పోస్ట్ చేసింది. రెండు రోజుల క్రితం ఆమె గుండెపోటుకు గురైనట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తానే స్వయంగా వెల్లడించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఒక్కసారిగా కలకలం రేపింది. ‘నేను రెండు రోజుల క్రితం హార్ట్‌ఎటాక్‌కి గురయ్యాను. వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. అలాగే గుండె లోపల స్టెంట్ అమర్చారు. నాకు వైద్యం అందించిన కార్డియాలజిస్ట్ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని వెల్లడించారు.

ఈ ప్రమాదం నుండి నన్ను బయటపడేలా చేసిన చాలామందికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే.. నేను బాగానే ఉన్నాను అన్న గుడ్‌న్యూస్‌ను నా అభిమానులతో అనుచరులతో పంచుకోవాలనుకున్నాను. అందుకే ఈ విషయం మీకు చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసింన అభిమానులు నటికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, గత కొంతకాలంగా పెరుగుతున్న గుండెపోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Advertisement

Next Story