బ్రేకప్ కన్ఫాం చేసిన హీరో.. ఆ హీరోయిన్‌తో రిలేషన్ కట్

by samatah |   ( Updated:2022-09-03 08:21:38.0  )
బ్రేకప్ కన్ఫాం చేసిన హీరో.. ఆ హీరోయిన్‌తో రిలేషన్ కట్
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో ప్రేమలో పడటం, విడిపోవడం చాలా కామన్. చాలా మంది సీనియర్ హీరో హీరోయిన్లు ప్రేమలో పడి కొన్ని రోజులు కలిసి ఉండి చివరకు బ్రేకప్ చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా పెళ్లై, పిల్లలున్నవారు కూడా ఈ మధ్య బ్రేకప్ చెప్పుకోవడం చాలా కామన్ అయిపోయింది.

ఇక ఇటీవల బాలీవుడ్ హీరో టైగర్స్ ష్రాఫ్, దిశా పటాని బ్రేకప్ చెప్పుకున్నారంటూ చాలా వార్తలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. కొన్ని రోజులు చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన వీరు, విడిపోయారని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో తమ అభిమానులు అయోమయంలో పడిపోయారు. కొందరు విడిపోయారు అంటే, మరికొందరు మాత్రం లేదు వీరు తమ పనిలో బిజీ అయిపోయారంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న హీరో తన లవ్ గురించి ఓ పెన్ అయ్యాడు. కరణ్ ష్రాఫ్‌ను దిశపటానికి‌తో లవ్ గురించి అడగగా, తాను ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూనే నేను సింగిల్ అని చెప్పేశాడు. దీంతో మేము బ్రేకప్ చెప్పుకున్నాం అని హీరో కన్ఫాం చేశాడంటున్నారు తమ అభిమానులు. ఇక తమ అభిమాన జంట విడిపోవడంతో ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.

Also Read : సెక్స్ కోసమే డేటింగ్ చేస్తున్నాడు.. డికాప్రియో బ్రేకప్‌లపై ట్రోలింగ్

Advertisement

Next Story