‘#ఎన్టీఆర్ 30’ షూటింగ్‌లో జాయిన్ అయిన బాలీవుడ్ హీరో

by Prasanna |   ( Updated:2023-04-20 12:29:45.0  )
‘#ఎన్టీఆర్ 30’ షూటింగ్‌లో జాయిన్ అయిన బాలీవుడ్ హీరో
X

దిశ, సినిమా: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ 30’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తుంది. 2024 ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా సైఫ్ అలీఖాన్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. కాగా సెట్స్‌లో నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ, సైఫ్ అలీఖాన్ ఫొటోలను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సెట్లోకి ‘OG’ ఎంట్రీ

నాకు చాలా టార్గెట్స్ ఉన్నాయి.. కెరీర్ ప్లానింగ్‌పై పూజా

Advertisement

Next Story