Sonakshi- zaheer: స్మిమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతున్న బాలీవుడ్ జంట.. వన్ మంత్ యానివర్సరీ అంటూ స్పెషల్ పోస్ట్

by Kavitha |   ( Updated:2024-07-24 05:45:15.0  )
Sonakshi- zaheer: స్మిమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతున్న బాలీవుడ్ జంట.. వన్ మంత్ యానివర్సరీ అంటూ స్పెషల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్‌ను ప్రేమించి గత నెల 23న పెద్దలను ఒప్పించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. రిసెప్షన్‌ను మాత్రం ముబైంలో గ్రాండ్‌గా చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసింది. పెళ్లి ఫొటోలు ఈ అమ్మడు నెట్టింట షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇక అప్పటి నుంచి సోనాక్షి సిన్హాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ భామ నిత్యం తన భర్తతో ఫారెన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న ప్రతి అప్డేడ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

తాజాగా సోనాక్షి వన్‌ మంత్‌ వెడ్డింగ్‌ యానివర్సరీ సెలబ్రేషన్స్‌ ఫోటోలను నెట్టింట షేర్‌ చేసింది. అందులో స్విమ్మింగ్‌ ఫూల్‌లో భర్త జహీర్‌ ఇక్బాల్‌తో కలిసి రొమాంటిక్‌గా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మొత్తానికి వన్‌ మంత్‌ వెడ్డింగ్‌ డే సెలబ్రేట్‌ చేసుకోవడంతో వీరికి అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.

(video link credits to sonakshi sinha instagram id)

Advertisement

Next Story

Most Viewed