#BycottMaldives.. ఇండియాపై మాల్దీవుల మంత్రి కాంట్రవర్సియల్ కామెంట్.. బాలీవుడ్ రియాక్షన్ ఇదే!

by Javid Pasha |   ( Updated:2024-01-08 06:59:48.0  )
#BycottMaldives.. ఇండియాపై మాల్దీవుల మంత్రి కాంట్రవర్సియల్ కామెంట్..  బాలీవుడ్ రియాక్షన్ ఇదే!
X

దిశ, సినిమా : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల లక్షదీవులను విజిట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్దీవులకు చెందిన మంత్రి మరియం షియునా కాంట్రవర్సియల్ కామెంట్ చేశారు. ‘ఇండియన్ పబ్లిక్ బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తారు. అక్కడి రోడ్లు సక్రమంగా ఉండవు. ఇదీ.. మీకల్చర్’ అంటూ మోడీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, నటి పూనమ్ పాండే స్పందించారు.

అక్షయ్ కుమార్ తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘మాల్దీవులకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి ఇండియాను కించపర్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు. భారత్ నుంచి మాల్దీవులకు ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. మేం టూరిజాన్ని ఎంకరేజ్ చేస్తుంటే.. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు. డిగ్నిటీ ఇంపార్టెంట్’’ అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇక నుంచి ఇండియాలోని ఐలాండ్స్‌ను ఎంకరేజ్ చేద్దామంటూ పిలుపునిస్తూ ‘ఎక్స్‌ప్లోర్ ఇండియన్ ఐల్యాండ్’ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.

ఇక అక్షయ్ ట్వీట్ చేసిన కాసేపటికే సల్మాన్‌ఖాన్ కూడా రియాక్ట్ అయ్యారు. ‘లక్ష్యద్వీప్ లాంటి ద్వీపాన్ని మన దేశ ప్రధాని ఎంతో క్లీన్‌గా ఉంచుతున్నారు. మాల్దీవుల మంత్రి అలా స్పందించడం వెనుక ఉద్దేశమేంటి?’ అని ప్రశ్నించారు. తాజాగా బాలీవుడ్ నటి, అడల్ట్ స్టార్ పూనమ్ పూనమ్ పాండే కూడా రియాక్ట్ అయ్యారు. ఇక నుంచి మాల్దీవుల్లో షూటింగ్ చేయంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘మాల్దీవులు అంటే నాకు చాలా ఇష్టం. కానీ అక్కడి ఒక ప్రముఖ వ్యక్తి ఇండియా గురించి చులకన చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు. నా నెక్ట్స్ షెడ్యూల్ అక్కడ ఉండటంతో నేను రానని మా టీమ్‌కు కూడా చెప్పేశా. ఇక లక్షద్వీప్‌‌లో షూట్ చేస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలవ్యాఖ్యలను నెటిజన్లు సమర్థిస్తున్నారు. వారికి సపోర్టుగా #BycottMaldives అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు మాల్దీవుల్లోని కొందరు ప్రజలు, ప్రముఖులు కూడా అక్కడి మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.


Advertisement

Next Story