ఈ 5జి కాలంలో భారీ బడ్జెట్ తో బ్లాక్ అండ్ వైట్ మూవీ.. స్టార్ హీరో రిస్క్ తీసుకుంటున్నాడా !

by Kavitha |   ( Updated:2024-02-05 15:07:08.0  )
ఈ 5జి కాలంలో భారీ బడ్జెట్ తో బ్లాక్ అండ్ వైట్ మూవీ.. స్టార్ హీరో రిస్క్ తీసుకుంటున్నాడా !
X

దిశ, సినిమా: ఈ రోజుల్లో భారీ బడ్జెట్ తో ఒక సినిమాను ఆడంబరంగా తీసి ప్రేక్షకులను మెప్పించడం కష్టంగా మారిపోయింది. ఒకప్పుడు తాతల కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎగబడి చూశారు. కానీ ఇప్పుడు కాలంతో పాటుగా అందరి ఆలోచనలు కూడా మారిపోయాయి. ఐమాక్స్, డాల్బీ విజన్, 8 కె అంటూ రకరకాల మార్పులతో ఆడియన్స్ సరికొత్త టెక్నాలజి అలవాటు పడిపోయారు. ఈ కారణంగానే హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఉన్న లార్జ్ స్క్రీన్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి టైం లో తాజాగా స్టార్ హీరో బ్లాక్ అండ్ వైట్ మూవీ తో రాబోతున్నాడు.

మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘భ్రమ యుగం’ ఇది బ్లాక్ వైట్ లో ఫిబ్రవరి 15న విడుదల కానుంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మమ్ముట్టి మొదటిసారి కంప్లీట్ హారర్ కంటెంట్ తో రాబోతున్నాడు. ఆయన గెటప్ కూడా భయంకరంగా ఉంది. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయట. ప్రత్యేకంగా బీజీఎం సౌండ్ ట్రాక్ ని ఇటీవలే యూట్యూబ్ లో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక మమ్ముట్టి లాంటి స్టార్ బ్లాక్ అండ్ వైట్ మూవీ తో రావడం ఛాలెంజ్ అనే చెప్పాలి. మరిక ఎలాంటి ఫలితం వస్తుందొ చూడాలి.

Read More..

హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి.. ఓటీటీలోకి సూపర్ హిట్ రివేంజ్ సినిమా



Advertisement

Next Story