Anji K Maniputra: సక్సెస్ ఫుల్ దర్శకుడికి చేదు అనుభవం.. నువ్వు డైరెక్టర్‌వా అంటూ ప్రశ్నించిన వ్యక్తి (వీడియో)

by sudharani |
Anji K Maniputra: సక్సెస్ ఫుల్ దర్శకుడికి చేదు అనుభవం.. నువ్వు డైరెక్టర్‌వా అంటూ ప్రశ్నించిన వ్యక్తి (వీడియో)
X

దిశ, సినిమా: నార్నే నితిన్, నయన్ సారికలు జంటగా నటించిన చిత్రం ‘ఆయన్’. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రజెంట్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే.. అంత మంచి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది.

తాజాగా డైరెక్టర్ అంజి కె మణిపుత్ర ‘ఆయ్’ చూసేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్ AMB సినిమాస్‌కు వెళ్లగా అప్పటికే థియేటర్ హౌస్ ఫుల్ అయింది. ఈ క్రమంలోనే టికెట్ కౌంటర్‌లో టికెట్స్ లేవు అని చెప్పడంతో.. నిరాశతో వెనుదిరుగుతూ ‘బన్నీ వాసు చూశారా మన ఆయ్ మూవీ బాగా ఆడుతుంది. మీరేమో థియేటర్స్ పెంచండి అంటే పెంచట్టేదు, డైరెక్టర్‌కి కూడా టికెట్స్ లేవు అని చెబుతున్నారు’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే.. ఇది ప్రమోషన్ స్టంట్ అని తెలుస్తుండగా.. వెనుతిరిగిన దర్శకుడిని మీరు డైరెక్టర్ ఆ అని వెనుక ఉన్న వ్యక్తి అడుగుతాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story