ఊహకందని రీతిలో మహేశ్ బాబుకు బర్త్ డే గిఫ్ట్.. ఏకంగా అంతరిక్షంలో..!

by Anjali |   ( Updated:2023-08-09 09:16:57.0  )
ఊహకందని రీతిలో మహేశ్ బాబుకు బర్త్ డే గిఫ్ట్.. ఏకంగా అంతరిక్షంలో..!
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ప్రిన్స్ కోసం తన ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే బర్త్ డే గిఫ్ట్ రెడీ చేశారు. అది ఏంటంటే..? సూపర్ స్టార్ పేరుపై ఏకంగా అంతరిక్షంలో నక్షత్రాన్ని రిజిస్టర్ చేశారు. హీరో పేరుపై రిజిస్టర్ చేసిన నక్షత్రం యొక్క సర్టిఫికెట్ కూడా పొందారు. ఈ సర్టిఫికె‌ట్‌లో ఆ నక్షత్రం వివరాలు క్లారిటీగా ఉన్నాయి. స్టార్ రిజిస్టేషన్ సంస్థ ఈ సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. ‘‘RA: 12h 33m 29s DEC: +69deg 47 17.6’’ కోఆర్డినేట్స్‌లో ప్రిన్స్ ఫ్యాన్స్ నక్షత్రానికి ఆయన నేమ్‌ను రిజిస్టర్ చేశారు.

దీంతో మన సూపర్ స్టార్ క్రేజ్ ఏకంగా అంతరిక్షానికి చేరింది. అంటూ ఫ్యాన్స్ ఎగిరిగంతులేస్తున్నారు. టాలీవుడ్ నుంచి గతంలో మెగా రామ్ చరణ్ పేరుపై కూడా నక్షత్రం రిజిస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ బర్త్ డేను ఈ హీరో ఫ్యాన్స్ ఎంతో ప్రత్యేకంగా మార్చేశారు. వీరు చేసిన ఈ ఘనత చూసి.. మహేష్‌కు తన అభిమానులు మధ్య ఇంత బాండింగ్ ఉందా అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read More..

మహేష్ బాబుకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్






Advertisement

Next Story