కూతురుకు మద్యం తాగించిన టాలీవుడ్ నటి.. నువ్వు అమ్మవేనా అంటూ సెటైర్స్

by samatah |   ( Updated:2022-08-10 06:31:26.0  )
కూతురుకు మద్యం తాగించిన టాలీవుడ్ నటి.. నువ్వు అమ్మవేనా అంటూ సెటైర్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ నటిలలో సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్ డోస్ పెంచుతూ.. హాట్ హాట్ ఫొటోస్‌తో రచ్చ చేస్తుంటుంది. అంతే కాకుండా తన కూతురుతో ఆమె చేసే అల్లరి మాములుగా ఉండదు. తల్లీ కూతుర్లు ఇద్దరూ గ్లామర్ షో చేస్తూ.. అందరినీ ఆకట్టుకుంటారు. అయితే ప్రస్తుతం సురేఖ వాణికి సంబంధిచిన ఒక వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సురేఖ, తన కూతురు సుప్రీత చాల క్లోస్‌గా ఉంటూ ఎప్పుడూ, పబ్‌లు పార్టీలలో కలిసి ఏంజాయ్ చేస్తుంటారు. అయితే నటి తన కూతురుకు దగ్గరుండి మద్యం తాగించడంతో వారి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సురేఖ వాణి తన కూతురు పుట్టిన రోజు వేడుకల్లో ఏకంగా మద్యం బాటిల్ నోట్లో పెట్టి తాగిపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. సుప్రిత అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఓ తల్లివై ఉండి ఇలా చేస్తావా అంటూ సురేఖపై మండి పడుతున్నారు. ఇక మరికొందరు అసలు నువ్వు అమ్మవేనా అంటూ సురేఖవాణిపై సెటైర్లు వేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఫ్యాన్స్‌కు నాగచైతన్య సూచన.. షాక్‌లో సమంత

సమంత మళ్లీ ఎదురైతే.. నాగచైతన్య అలా చేస్తాడంట

Advertisement

Next Story

Most Viewed