రెండో భార్య గురించి బయటపెట్టిన బిగ్‌బాస్ శివాజీ.. వైరలవుతోన్న సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |
రెండో భార్య గురించి బయటపెట్టిన బిగ్‌బాస్ శివాజీ.. వైరలవుతోన్న సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. హీరోగా అవకాశం సంపాదించుకున్నారు శివాజీ. ఈ నటుడు తీసినవి కొన్ని సినిమాలైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక రీసెంట్‌‌గా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. హెల్త్ సహకరించకపోవడంతో శివాజీ.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను పెద్దగా ఆడలేకపోయారు. అయినా కూడా ఫ్యాన్స్ శివాజీకి చాలా బాగా సపోర్ట్ చేశారు. చివరి టాప్ 3 కంటెస్టెంట్‌గా బయటకు వచ్చారు. హౌస్ నుంచి వచ్చాక ఈయన ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు. చివరి వారంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ తనను నెగిటివ్‌గా చూపించడం వల్లే తాను గెలవలేకపోయానని వెల్లడించారు.

అలాగే నాగార్జున కారణంగానే శివాజీకి సినిమాల్లో చాన్స్‌లు వచ్చాయని.. దీంతో తాను ఆస్తులను కొన్నానని తెలిపారు. ఇక తాజాగా ఓ మీడియాకు శివాజీ ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రెండో పెళ్ళాం ఉందంటూ షాకింగ్ వార్త చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ‘‘నా రెండో భార్య అంటే అమ్మాయి కాదు. కాఫీ నా సెకండ్ వైఫ్ అని’’ చెప్పారు. వెంటనే అక్కడున్నవారు ఊపిరిపీల్చుకున్నారు. ‘నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. అందుకే కాఫీనే నా రెండో భార్య అని ఎప్పుడూ చెబుతుంటాను.’ అని తెలిపారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా ఈయన కాఫీ కోసం పెద్ద ఎత్తున గొడవ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed