‘Bigg Boss Season-7’ లో ఈ సారి కుడి ఎడమైవుతుందంటున్న Nagarjuna.. ప్రోమో రిలీజ్

by Hamsa |   ( Updated:2023-10-10 15:33:40.0  )
‘Bigg Boss Season-7’ లో ఈ సారి కుడి ఎడమైవుతుందంటున్న Nagarjuna..  ప్రోమో రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ ‘బిగ్‌బాస్’ షోకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుని దూసుకుపోతోంది. ప్రస్తుతం 7వ సీజన్ ‘స్టార్ మా’ లో త్వరలో ప్రారంభం కానుంది.

అయితే ఇటీవల విడుదలైన ప్రోమో ఆసక్తిని పెంచింది. ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా హోస్ట్‌గా ఏ స్టార్ హీరో వస్తారని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాలుగు సీజన్లకు నాగార్జుననే హోస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా, బిగ్‌బాస్ ప్రోమో విడుదలైంది. అందులో నాగార్జులన సరికొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ ప్రోమోలో నాగార్జున చేతిలో పాప్ కార్న్ పట్టుకొని బిగ్‌బాస్ సీజన్ 7 వచ్చేస్తుంది. ఈ సారి కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ చెప్పారు. దీంతో ఈ సారి ఏదో కొత్త థీమ్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి: Manchu Lakshmi అరాచకం.. ఇంట్లో ప్యాంట్‌ విప్పేసి..

Advertisement

Next Story