రామ్ చరణ్‌తో ఒక్కరోజు డేటింగ్ చేసిన చాలు.. సరయు షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-08-02 10:50:21.0  )
రామ్ చరణ్‌తో ఒక్కరోజు డేటింగ్ చేసిన చాలు.. సరయు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సరయు గురించి పరిచయం అక్కర్లేదు. సెవెన్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్‌లో బోల్డ్ కంటెంట్‌తో అలరిస్తూ అడల్ట్ కంటెంట్‌తో ఆమె చేసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇక ‘బిగ్ బాస్ సీజన్ 5’ ఛాన్స్ కొట్టేసి మరింత పాపులారిటి దక్కించుకుంది. ప్రస్తుతం అడపదడప సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా సరయు స్టార్ హీరో రామ్ చరణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నాకు రామ్ చరణ్ అంటే మహా ఇష్టం. ఆయనకు పెళ్లైన విషయం తెలిసి తెగ బాధపడిపోయా. ఆయనతో ఒక్కరోజు డేటింగ్ చేసినా చాలు. ఆ రోజు వస్తే వదులుకోను. దానికోసం నేను ఎప్పుడు రెడీ’ అంటూ తనకున్న ప్రేమను చాటుకుంది.

Advertisement

Next Story