- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంబర్‌పేట్ శంకరన్నతో పల్లవి ప్రశాంత్ సుదీర్ఘ చర్చలు.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమా?
దిశ, సినిమా: నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి సుపరిచితమే. కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. హౌస్ లో పెద్దగా అన్ని చూసుకున్న శివాజీ హెల్త్ బాగోలేనప్పుడు ప్రశాంత్ అతడి బాగోగులు చూసుకుని.. మంచి మనసుతో జనాలకు మరింత దగ్గరయ్యాడు. చివరకు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ విన్నర్ గా నిలిచాడు. తను గెలుచుకున్న రూ. 35 లక్షలు రైతులకు పంచుతానని హామీ ఇచ్చాడు. మాట ఇచ్చినట్లుగానే ఇటీవల ఓ పేద కుటుంబానికి లక్ష రూపాయలు సాయం చేసి అండగా నిలిచాడు. అంతేకాకుండా ఏడాదికి సరిపడా బియ్యం కూడా అందజేశాడు. ఇదంతా పక్కన పెడితే..
తాజాగా పల్లవి ప్రశాంత్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే ప్రశాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని, ఆ పార్టీలో.. ఈ పార్టీలో చేరుతున్నాడని నెట్టింట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలకు బలాన్ని చేకూర్చేలా తాజాగా పల్లవి ప్రశాంత్ గురించి మరో వార్త వైరల్ అవుతోంది. అయితే ప్రశాంత్ రీసెంట్ అంబర్‌పేట్ శంకరన్న ఇంట్లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. శంకరన్నతో, పల్లవి ప్రశాంత్ పలు విషయాలు చర్చిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇదంతా చూస్తే రైతుబిడ్డ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని అర్థమవుతోంది, అసలు ప్రశాంత్ ప్లాన్ ఏంటి? అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.