- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss : స్టార్ట్ అయిందా అసలు.. విన్నర్‌ను ప్రకటించేసిన బిగ్ బాస్.. ఆ పిల్లకే దక్కింది..
దిశ, సినిమా : బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. సీనియర్ హీరో అనిల్ కపూర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ రియాలిటీ షో అనుకున్నంత సక్సెస్ కాలేదు కానీ వివాదాలకు మాత్రం కొదువ లేకుండా పోయింది. ముఖ్యంగా బహు భార్యత్వం గురించి ప్రచారం చేస్తుందని.. శృంగారాన్ని ప్రమోట్ చేసిందని.. ఫ్యామిలీ షో కాస్త పోర్న్ షో అయిపోయిందని తిట్టిపోశారు జనాలు. బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు సోషల్ యాక్టివిస్టులు. ఇన్ని గొడవలు, విమర్శలు నడుమ షో కొనసాగినా టీఆర్పీ రేటింగ్ మాత్రం చాలా తగ్గిపోయింది. మునుపటి సీజన్స్ తో పోలిస్తే డిజాస్టర్ గా నిలిచింది. ఎలా సాగినా షో విన్నర్ ను ప్రకటించాలి కాబట్టి ఫైనలిస్టులలో చివరికి మిగిలిన ఇద్దరిలో ఒక్కరిని విజేతగా ప్రకటించాడు అనిల్ కపూర్. మొత్తానికి మరోసారి హిందీ
బిగ్ బాస్ లో విన్నింగ్ ట్రోఫీ అందుకుంది అమ్మాయి కావడం విశేషం. కాగా సనా మక్బూల్ ఈ సీజన్ విన్నర్ గా నిలిచింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'ఎందుకంత ఓవరాక్షన్ చేస్తుంది ఈ అమ్మాయి.. అసలు ఏం జరిగిందని.. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచినట్లు ఫీల్ అయిపోతుంది ఏంటి ? ' అని కామెంట్స్ చేస్తున్నారు. 'అస్సలు నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు ఎండ్ అయింది? బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించాడా? ' అని ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు. అభిమానులు మాత్రం సన గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆమె గెలవాలని రోజూ దేవుడిని మొక్కుకున్నామని చెప్తున్నారు.