నేను అరెస్ట్ కాలేదంటూ.. రేవ్ పార్టీపై స్పందించిన బిగ్‌బాస్ హిమజ.. వీడియో వైరల్

by Hamsa |   ( Updated:2023-11-12 09:37:16.0  )
నేను అరెస్ట్ కాలేదంటూ.. రేవ్ పార్టీపై స్పందించిన బిగ్‌బాస్ హిమజ.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారులో ఇబ్రహీంపట్నంలోని ఫామ్‌హౌజ్‌లో రేవ్ పార్టీ జరిగిందట. దీంతో పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో బిగ్‌బాస్ హిమజతో పాటు 11 మంది స్టార్లు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా, దీనిపై బిగ్‌బాస్ హిమజ స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘ నిన్న నా కొత్తింట్లో తొలిసారి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాను.

నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీ చేసుకున్నాను. ఎవరో ఏదో అనుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి మా ఇంటిని సోదా చేశారు. అందుకు మేము కూడా సహకరించాం. వాళ్ల విధిని నిర్వర్తించారు. అయితే కొందరు దీన్ని రేవ్ పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఇంట్లోనే ఉన్నాను. సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుంటే నేను అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. దయచేసి దాన్ని ఎవరూ నమ్మవద్దు’’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

Advertisement

Next Story