కోట్ల విలువైన ఇల్లు నిర్మించిన బిగ్‌ బాస్ కంటెస్టెంట్.. ఫోటోలు వైరల్

by Anjali |   ( Updated:2023-06-11 16:42:22.0  )
కోట్ల విలువైన ఇల్లు నిర్మించిన బిగ్‌ బాస్ కంటెస్టెంట్.. ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై సీరియల్‌ నటిగా కెరీర్ ప్రారంభించిన హిమజ ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు.‘‘నేను శైలజ, జనతా గ్యారేజ్, స్పైడర్, శతమానం భవతి, వినయ విధేయ రామ’’ వంటి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టాయి. అలాగే బిగ్ బాస్ సీజన్-3లో హిమజ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కొన్ని వారాలు హౌస్‌లో అలరించారు. అయితే ఈ భామ కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీలో నూతన ఇల్లు నిర్మాణం చేపట్టారు. ఇటీవల ఇల్లు పనులు పూర్తి కాగా.. హిమజ గృహప్రవేశం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈ రోజు(జూన్ 11)న ఉదయం ముహూర్తం మేరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, కొత్త ఇంట్లో అడుగు పెట్టారు. లక్ష్మీదేవి పటం పట్టుకొని నిండుగా పట్టువస్త్రాలు ధరించి ఉన్న ఈ అందాల తార ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి..‘‘ కొత్త ఇల్లు కట్టుకోవడం అంటే మన కలలు నెరవేర్చుకోవడం, జ్ఞాపకాలను పదిల పరుచుకోవడం. నాకు నేనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను’’ అంటూ ఫోటో కింద కాప్షన్ రాసుకొచ్చారు. కాగా హిమజకు ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తూ.. తను నిర్మించిన హౌస్ విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Click here for Instagram link

Advertisement

Next Story